National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 30,570 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,33,47,325కి చేరింది. అదే సమయంలో 38,303 మంది కోలుకున్నార‌ని అధికారులు తెలిపారు. దేశంలో క‌రోనాతో మ‌రో 431 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,43,928కి పెరిగింది. ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,25,60,474 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 3,42,923 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 76,57,17,137 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. దేశంలో అత్య‌ధికంగా కేరళలో 17,681 కొత్త‌ కేసులు న‌మోద‌య్యాయి. ఆ రాష్ట్రంలో 208 మంది కరోనా రోగులు మృతి చెందారు.

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందారు. ఇదే సమయంలో 280 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,62,526కి చేరుకుంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 79 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక మొత్తం 6,53,302 మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా 3,899 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 73,323 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.60 శాతంగా ఉందని, మరణాల రేటు 0.58 శాతంగా ఉందని తెలంగాణ ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,325 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 62,252 మంది శాంపిల్స్ పరీక్షించగా 1,445 మందికి కరోనా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 274, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 11 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వల్ల 11 మంది మృతి చెందారు. 1,243 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,33,419కి చేరుకుంది. ఇప్పటి వరకు 20,04,786 మంది కోలుకున్నారు. మొత్తం 14,030 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,603 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × 2 =

Back to top button