National

భారతదేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భార‌తదేశంలో గత 24 గంటల్లో 32,937 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,22,25,513కు చేరింది. అదే సమయంలో క‌రోనా నుంచి 35,909 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 417 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,31,642 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,14,11,924 మంది కోలుకున్నారు. 3,81,947 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 54,58,57,108 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 50,126 కరోనా పరీక్షలు నిర్వహించగా, 245 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 52 కేసులు నమోదవ్వగా.. యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 582 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక్కరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,52,380 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,41,270 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 7,268 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 3,842కి పెరిగింది.

15-08-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గడచిన 24 గంటల్లో 65,500 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,506 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 319 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 15 పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో 1,835 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మంది మృత్యువాత పడ్డారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13,647కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 19,93,697 పాజిటివ్ కేసులు నమోదు కాగా 19,62,185 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. 17,865 మంది చికిత్స పొందుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

2 + one =

Back to top button