భారతదేశంలో గత 24 గంటల్లో 38,949 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 40,026 మంది కోలుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,26,829కు చేరింది. అదే సమయంలో 542 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,12,531కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,01,83,876 మంది కోలుకున్నారు. 4,30,422 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 39,53,43,767 వ్యాక్సిన్ డోసులు వేశారు.
15-07-2021న తెలంగాణ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1,10,355 కరోనా పరీక్షలు నిర్వహించగా, 710 కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 80 కొత్త కేసులు నమోదు కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 71 కేసులు గుర్తించారు. నిర్మల్, నారాయణపేట జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 808 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,747కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,34,605 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,20,757 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,101 మంది చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 93,785 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,526 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 404 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 35 కేసులు గుర్తించారు. అదే సమయంలో 2,933 మంది కరోనా నుంచి కోలుకోగా, 24 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,32,105 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా.. 18,93,498 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 25,526 మంది చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో కరోనా మృతుల సంఖ్య 13,081కి పెరిగింది.