భారతదేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
903

భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగింది. గ‌డిచిన 24 గంటల్లో 7,52,818 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 2,876 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. తాజా లెక్కల ప్రకారం దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,29,98,938కి చేరింది. గత 24 గంటల్లో 98 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,16,072కి చేరింది.

తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య తగ్గిపోతుండడంతో యాక్టివ్ కేసుల సంఖ్యలోనూ తగ్గుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో 24,848 కరోనా పరీక్షలు నిర్వహించగా, 81 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 35 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 123 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,499 మంది కరోనా బారినపడగా, వారిలో 7,85,565 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 823 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనా ప్రభావంతో 4,111 మంది మరణించారు.

ఏపీలో గడచిన 24 గంటల్లో 10,914 కరోనా పరీక్షలు నిర్వహించగా, 59 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 28 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 83 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మృతి చెందారు. కరోనా వ్యాప్తి మొదలయ్యాక రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,943 మంది కరోనా బారినపడగా, వారిలో 23,03,690 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 523 మంది చికిత్స పొందుతున్నారు.