More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    దేశంలో గత 24 గంటల్లో 30,615 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. క‌రోనా నుంచి గత 24 గంటల్లో 82,988 మంది కోలుకున్నారు. అదే సమయంలో 514 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్ర‌స్తుతం 3,70,240 మంది క‌రోనాకు ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.45 శాతంగా ఉంది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,18,43,446గా ఉంది.

    తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 569 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 51,518 కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 133 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 2,098 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,84,631 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,72,145 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,379 మంది చికిత్స పొందుతున్నారు.

    ఏపీలో గడచిన 24 గంటల్లో 22,267 శాంపిల్స్ పరీక్షించగా, 615 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 134 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 2,787 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,13,827 మంది కరోనా బారినపడగా, వారిలో 22,86,575 మంది కోలుకున్నారు. ఇంకా 12,550 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,702కి పెరిగింది.

    Trending Stories

    Related Stories