More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారత దేశంలో గత 24 గంటల్లో 10,229 కొత్త కేసులు నమోదయ్యాయి. 125 మంది మహమ్మారి కారణంగా మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,34,096 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 523 రోజుల్లో ఇంత తక్కువ సంఖ్యలో యాక్టివ్ కేసులు ఉండటం ఇదే. దేశంలో రికవరీ రేటు ప్రస్తుతం 98.26 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 11,926 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,38,49,785కి పెరిగింది. మరోవైపు 112.34 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇప్పటి వరకు వేశారు. దేశంలోని కరోనా కేసులలో సగానికి పైగా కేసులు కేరళలోనే నమోదయ్యాయి. కేరళలో నిన్న 5,848 కేసులు నమోదు కాగా… 46 మంది మృతి చెందారు.

    తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 23,888 కరోనా పరీక్షలు నిర్వహించగా 105 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 59 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 17 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 106 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,73,574 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,65,861 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,740 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,973గా ఉంది.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 32,630 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 208 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 53 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో నాలుగు కొత్త కేసులు గుర్తించారు. అదే సమయంలో 247 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,69,978 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,52,477 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,086 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,415కి పెరిగింది.

    Trending Stories

    Related Stories