National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

దేశంలో గత 24గంటల్లో కొత్తగా 27,176 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో భారతదేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,33,16,755కి చేరింది. అదే సమయంలో 38,012 మంది కోలుకున్నార‌ని తెలిపింది. దేశంలో క‌రోనాతో మ‌రో 284 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,43,497కి పెరిగింది. ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,25,22,171 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 3,51,087మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. నిన్న దేశంలో 61,15,690 వ్యాక్సిన్ డోసుల‌ను ప్ర‌జ‌ల‌కు వేశారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 75,89,12,277 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. దేశంలోనే అత్య‌ధికంగా కేరళలో 15,876 కొత్త‌ కేసులు న‌మోద‌య్యాయి. నిన్న 129 మంది మృతి చెందారు.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 76,481 కరోనా పరీక్షలు నిర్వహించగా, 336 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 96 కొత్త కేసులు వెల్లడి కాగా.. కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 306 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,62,202 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,53,022 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,282 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,898కి పెరిగింది.

14-09-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం ఏపీలో గడచిన 24 గంటల్లో 49,568 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,125 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 210 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఒక పాజిటివ్ కేసును గుర్తించారు. అదే సమయంలో 1,356 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,019కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,31,974 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,03,543 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,412 మంది చికిత్స పొందుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × five =

Back to top button