National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భార‌తదేశంలో గత 24 గంటల్లో 36,083 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. తాజా లెక్కల ప్రకారం దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,92,576కు చేరింది. అదే సమయంలో క‌రోనా నుంచి 37,927 మంది కోలుకున్నారు. గత 24గంటల్లో 493 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,31,225 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,13,76,015 మంది కోలుకున్నారు. 3,85,336 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 87,355 కరోనా పరీక్షలు నిర్వహించగా 420 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 71 కొత్త కేసులు నమోదు కాగా, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 623 మంది కరోనా నుంచి కోలుకోగా ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,52,135 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,40,688 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 7,606 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,841కి చేరింది.

14-08-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గడచిన 24 గంటల్లో 69,088 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,535 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 299 కొత్త కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 8 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 2,075 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి ఏపీలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 13,631కి చేరుకుంది. రాష్టంలో మొత్తం 19,92,191 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 19,60,350 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 18,210 మంది చికిత్స పొందుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

seventeen − 6 =

Back to top button