National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

భారతదేశంలో గత 24 గంటల్లో 4.40 లక్షల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 8,822 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 5,718 మంది కోలుకోగా… 15 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 53,637కి పెరిగింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 4,32,45,517కి చేరుకుంది. వీరిలో 4,26,67,088 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,792 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.66 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా, పాజిటివిటీ రేటు 2 శాతంగా, క్రియాశీల రేటు 0.12 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కేసుల్లో ఎక్కువగా మహారాష్ట్రలో 2,956, కేరళలో 1,989, ఢిల్లీలో 1,118, కర్ణాటకలో 594 నమోదయ్యాయి.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,662 కరోనా పరీక్షలు నిర్వహించగా, 219 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 164 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 19, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 76 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,94,803 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,89,433 మంది కోలుకున్నారు. 4,111 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 1,259 మంది చికిత్స పొందుతున్నారు.

Related Articles

Back to top button