National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

భారతదేశంలో కొత్తగా 18,987 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 19,808 మంది కోలుకోగా, 246 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తాజా లెక్కల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 3,40,20,730కు చేరింది. ఇందులో 3,33,62,709 మంది బాధితులు కోలుకోగా.. 2,06,586 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 4,51,435 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 96,82,20,997 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. అక్టోబర్‌ 13 నాటికి 58,76,64,525 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) తెలిపింది.

13-10-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా లెక్కల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 38,786 కరోనా పరీక్షలు నిర్వహించగా 517 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 97 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 2 కేసులు వెలుగు చూశాయి. అదే సమయంలో 826 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,58,582 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,37,691 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,615 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,276కి పెరిగింది.

తెలంగాణలో గత 24 గంటల్లో 38,834 కరోనా పరీక్షలు నిర్వహించగా, 184 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 55 కొత్త కేసులు వెల్లడి కాగా, వనపర్తి, ములుగు, కామారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 162 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,68,450 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,60,305 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,211 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,934కి పెరిగింది.

Related Articles

Back to top button