More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో గత 24గంటల్లో కొత్తగా 25,404 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,32,89,579కి చేరింది. అదే సమయంలో 37,127 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 339 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,43,213కి పెరిగింది. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,24,84,159 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 3,62,207 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. దేశంలో 78,66,950 వ్యాక్సిన్ డోసుల‌ను ప్ర‌జ‌ల‌కు వేశారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 75,22,38,324 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. కేర‌ళ‌లో దేశంలోనే అత్య‌ధికంగా 15,058 కొత్త‌ కేసులు న‌మోద‌య్యాయి. నిన్న 99 మంది మృతి చెందారు.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 70,974 కరోనా పరీక్షలు నిర్వహించగా, 315 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 75 కొత్త కేసులు నమోదు కాగా నారాయణపేట, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 318 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,61,866 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,52,716 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 5,253 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,897కి పెరిగింది.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38,746 కరోనా పరీక్షలు నిర్వహించగా, 864 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 141 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 1,310 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మృత్యువాత పడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,010కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,30,849 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20,02,187 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,652 మంది చికిత్స పొందుతున్నారు.

    Trending Stories

    Related Stories