Telugu States

భారతదేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భారతదేశంలో కొత్త‌గా 14,092 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. పాజిటివిటీ రేటు 4.36 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 98.54 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.26 శాతానికి పడిపోయాయి. భారత్​లో శనివారం 28,01,457 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,07,99,63,555కు చేరింది. మరో 3,81,861మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 59,45,50,623కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,53,327 మంది మరణించారు. ఒక్కరోజే 7,60,524 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా నుండి కోలుకున్నవారి సంఖ్య 56,75,23,279కు చేరింది.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 28,899 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 440 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో అత్యధికంగా 195 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 36, రంగారెడ్డి జిల్లాలో 28 కేసులు గుర్తించారు. అదే సమయంలో 652 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,28,911 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,21,249 మంది కోలుకున్నారు. ఇంకా 3,551 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో 4,111 మంది మరణించారు.

Related Articles

Back to top button