భారతదేశంలో గత 24 గంటల్లో 38,792 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అదే సమయంలో 41,000 మంది కోలుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,46,074కు చేరింది. అదే సమయంలో 624 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,11,408కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,01,04,720 మంది కోలుకున్నారు. 4,29,946 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 38,76,97,935 వ్యాక్సిన్ డోసులు వేశారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,18,778 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 767 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 84 కొత్త కేసులు నమోదు కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 77 కేసులను గుర్తించారు. అత్యల్పంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఒక కేసు నమోదైంది. అదే సమయంలో 848 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు 3,738 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో నేటివరకు 6,33,146 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,19,344 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 10,064 మందికి చికిత్స జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 81,763 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,567 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 356 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 3,034 మంది కోలుకోగా, 18 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,26,988 పాజిటివ్ కేసులు నమోదు కాగా 18,87,236 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఇంకా 26,710 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 13,042కి పెరిగింది.