కరోనా కేసుల అప్డేట్స్.. 72 రోజుల తర్వాత అతి తక్కువ కేసుల నమోదు..!

0
675

భారతదేశంలో గత 24 గంటల్లో 70,421 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. గత 72 రోజుల్లో ఇవే తక్కువ కేసులు కావడంతో కరోనా కట్టడి అవుతోందని స్పష్టంగా తెలుస్తోంది. అదే సమయంలో 1,19,501 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,10,410కు చేరింది. మరో 3,921 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో మృతుల సంఖ్య మొత్తం 3,74,305కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,81,62,947 మంది కోలుకున్నారు. 9,73,158 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 25,48,49,301 మందికి వ్యాక్సిన్లు వేశారు.

13-06-2021న తెలంగాణ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 91,621 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,280 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 165 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఖమ్మం జిల్లాలో 156 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 1 కేసును గుర్తించారు. 2,261 మంది కరోనా నుంచి కోలుకోగా, 15 మంది మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,03,369 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5,78,748 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 21,137 మంది చికిత్స పొందుతున్నారు. మరణాల సంఖ్య 3,484కి చేరింది.

ఏపీలో గడచిన 24 గంటల్లో 1,02,876 కరోనా పరీక్షలు చేపట్టగా 6,770 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,199 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 248 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో 12,492 మంది కరోనా నుంచి కోలుకోగా, 58 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18,09,844 పాజిటివ్ కేసులు నమోదు కాగా 17,12,267 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 85,637 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 11,940కి పెరిగింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here