దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల్లో దేశంలో 34,113 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి గత 24 గంటల్లో 91,930 మంది కోలుకోగా.. 346 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతంకు చేరింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 4,78,882 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 4,16,77,641 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 5,09,011కు చేరుకుంది.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 32,932 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 429 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 142 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2,421 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,83,448 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,67,660 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 11,681 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,107కి పెరిగింది.
ఏపీలో గడచిన 24 గంటల్లో 22,785 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 749 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 125 కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 6,271 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,12,778 మంది కరోనా బారినపడగా, వారిలో 22,79,152 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 18,929 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,697కి పెరిగింది.