దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

0
754

భారతదేశంలో కరోనా ఉద్ధృతి భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,64,202 కేసులు నమోదయ్యాయి. ఎనిమిది నెలల తర్వాత ఈ స్థాయిలో కరోనా కేసులు పెరిగిపోవడం ఇదే తొలిసారి. దేశంలో ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 5,753కు పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఒమిక్రాన్ కేసుల సంఖ్యలో 4.83 శాతం పెరుగుదల కనిపించింది. దేశంలో నమోదైన తాజా కేసులతో కలుపుకుని 12,72,073 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. రోజువారీ పాజిటివ్ రేటు 14.78 శాతానికి పెరిగింది. పాజిటివిటీ రేటు 11.83 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,09,345 మంది కోలుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 84,280 శాంపిల్స్ పరీక్షించగా 2,707 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,328 కొత్త కేసులు నమోదు అయ్యాయి అదే సమయంలో 582 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,02,801 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,78,290 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 20,462 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,049కి పెరిగింది.

ఏపీలో కరోనా వ్యాప్తి పెరిగిపోతూ ఉంది. గడచిన 24 గంటల్లో 47,884 శాంపిల్స్ పరీక్షించగా 4,348 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 932 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 261 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,92,227 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,63,516 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం 14,204 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,507కి పెరిగింది.