More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో గత 24 గంటల్లో 12,66,589 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 11,850 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. గత 274 రోజుల్లో ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో 555 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,36,308 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 4,63,245 మంది కరోనా కారణంగా చనిపోయారు. గత 24 గంటల్లో 12,403 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇప్పటి వరకు 3.44 కోట్ల మంది కరోనా బారిన పడగా… 3.38 కోట్ల మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు టీకా వేయించుకున్న వారి సంఖ్య 1,11,40,48,134కి చేరుకుంది.

    ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 33,362 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 262 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 46 కొత్త కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఒక కేసు నమోదైంది. అదే సమయంలో 229 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,69,614 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,51,976 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,227 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,411కి పెరిగింది.

    తెలంగాణలో గత 24 గంటల్లో 39,804 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 172 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో ఇద్దరు మృతి చెందారు. 167 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,972కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,73,312 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,65,599 మంది ఆరోగ్యవంతులయ్యారు. 3,741 మంది చికిత్స పొందుతున్నారు.

    Trending Stories

    Related Stories