భారతదేశంలో కొత్తగా 15,823 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,40,01,743కు చేరింది. అదే సమయంలో 22,844 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 3,33,42,901 మంది కోలుకున్నారు. దేశంలో కరోనాతో 226 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం మృతుల సంఖ్య 4,51,189కు పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 2,07,653 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు దేశంలో వినియోగించిన డోసుల సంఖ్య 96,43,79,212కు చేరింది. కేరళలో నిన్న 7,823 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆ రాష్ట్రంలో 106 మంది మృతి చెందారు.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటలలో 44,310 కరోనా పరీక్షలు నిర్వహించగా 196 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 59 కొత్త కేసులు నమోదు కాగా.. వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, ములుగు, మెదక్, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 201 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,68,266 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,60,143 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,190 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,933కి పెరిగింది.
ఏపీలో గడచిన 24 గంటల్లో 32,846 కరోనా పరీక్షలు నిర్వహించగా, 503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 108 కొత్త కేసులు వెల్లడి కాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఇద్దరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో 817 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మరణించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే నలుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,268కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,58,065 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,36,865 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 6,932 మంది చికిత్స పొందుతున్నారు.