National

భారతదేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..!

భారతదేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం నాడు 16,561 పాజిటివ్‌ కేసులు నమోదవగా.. శనివారం కొత్తగా 15,815 కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42,39,372కు చేరింది. 4,35,93,112 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,996 మంది మరణించారు. 1,19,264 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 20,018 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, 68 మంది మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 4.36 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో 0.27 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 98.54 శాతంగా ఉండగా.. మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 207.71 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్రం తెలిపింది.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 30,205 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 476 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాదులో 239 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో 26 చొప్పున కేసులు నమోదవగా, కరీంనగర్ జిల్లాలో 22 కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఇంకా 237 మంది ఫలితాలు తెలియాల్సి ఉంది. అదే సమయంలో 984 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,28,471 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,20,597 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,763 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.

Related Articles

Back to top button