National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భారతదేశంలో గత 24గంటల్లో 40,120 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,17,826కు చేరింది. గత 24 గంటల్లో క‌రోనా నుంచి 42,295 మంది కోలుకోగా.. 585 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారతదేశంలో మృతుల సంఖ్య మొత్తం 4,30,254కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,13,02,345 మంది కోలుకున్నారు. 3,85,227 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 52,95,82,956 వ్యాక్సిన్ డోసులు వేసినట్టు అధికారులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 89,675 నమూనాలు పరీక్షించగా 453 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 69 కేసులు నమోదు కాగా, నారాయణపేట జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 591 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తెలంగాణలో ఇప్పటిదాకా 6,51,288 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,39,456 మంది కోలుకున్నారు. ఇంకా 8,137 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,836కి పెరిగింది.

12-08-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 70,757 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,859 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 402 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,575 మంది కరోనా నుంచి కోలుకోగా, 13 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి ఏపీలో కరోనా మృతుల సంఖ్య 13,595కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,88,910 పాజిటివ్ కేసులు నమోదు కాగా 19,56,627 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 18,688 మంది చికిత్స పొందుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

4 × 2 =

Back to top button