భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 31,443 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 118 రోజుల్లో ఇదే అత్యల్పమని అధికారులు తెలిపారు. భారత్ లో రికవరీ రేటు 97.28 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. ప్రస్తుతం దేశంలో 4,31,315 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇది 109 రోజుల్లో అత్యల్పం అని పేర్కొన్నారు. గత 24 గంటల్లో కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 2020గా ఉన్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం కరోనా మరణాల సంఖ్యను రివైజ్ చేయడంతో 1481 మంది మరణించినట్లు రికార్డుల్లోకి ఎక్కించారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,05,797 కరోనా పరీక్షలు నిర్వహించగా, 696 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయని అధికారులు తెలిపారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 82 కొత్త కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 68 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఒక కేసు నమోదైంది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 858 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి మొత్తం 3,735 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,32,379 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,18,496 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,148 మంది చికిత్స పొందుతున్నారు.
ఏపీలో గత 24 గంటల్లో 62,657 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 1,578 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 305 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 31 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 3,041 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,24,421కి పెరిగాయి. మొత్తం 18,84,202 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 13,024 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27,195 యాక్టివ్ కేసులు ఉన్నాయి.