దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
715

భారతదేశంలో వరుసగా మూడో రోజు 8 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,084 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 4,592 మంది కోలుకోగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 47,995 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,32,30,101కి చేరింది. ఇప్పటి వరకు 4,26,57,335 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం 5,24,771 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 98.68 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా, క్రియాశీల రేటు 0.11 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,95,19,81,150 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో 4,309 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2,946 కేసులు, కర్ణాటకలో 463, హర్యానాలో 304 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 13,254 కరోనా పరీక్షలు నిర్వహించగా, 129 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 104 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 9, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 8 కేసులు వెలుగు చూశాయి. అదే సమయంలో 67 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఇప్పటివరకు తెలంగాణలో 4,111 మంది కరోనాతో మృతి చెందారు. తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 1000 దాటింది. ఇంకా 1,039 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,94,458 మంది కరోనా బారినపడగా, వారిలో 7,89,308 మంది కోలుకున్నారు.