More

    దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న కరోనా కేసులు..!

    భారతదేశంలో క‌రోనా కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 2,47,417 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. అదే సమయంలో క‌రోనా నుంచి 84,825 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 11,17,531 మంది క‌రోనాకు హోం క్వారంటైన్, ఆసుప‌త్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య‌ 5,488కు పెరిగింది. గత 24 గంటల్లో క‌రోనాతో 380 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 4,85,035కు చేరింది.

    ఏపీలో గత 24 గంటల్లో 3,205 మంది కరోనా బారిన పడ్డారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 695 కేసులు నమోదు కాగా.. కడప జిల్లాలో అత్యల్పంగా 42 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 281 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 20,87,879కి చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా నుంచి 20,63,255 మంది కోలుకోగా… 14,505 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,119 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    థర్డ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పట్నుంచే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోంది. కరోనా కేసులు పెరిగిపోతుండడంతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఎక్కడా ఆక్సిజన్ కొరత రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అన్ని ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ స్టాక్ ను పెట్టుకోవాలన్నారు. కనీసం 48 గంటలకు సరిపడా ఉండేలా ప్రాణ వాయువు బఫర్ స్టాక్ ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన పీఎస్ఏ ప్లాంట్లు సరిగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

    Trending Stories

    Related Stories