National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భారతదేశంలో గత 24 గంటలుగా 12,516 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 501 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 267 రోజుల క‌నిష్ఠానికి చేరాయి. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,37,416 మంది చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో క‌రోనా నుంచి 13,155 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,38,14,080కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 4,62,690కి పెరిగింది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,10,79,51,225 డోసుల వ్యాక్సిన్లు వాడారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 36,510 కరోనా పరీక్షలు నిర్వహించగా 153 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 52 కొత్త కేసులు నమోదు కాగా వికారాబాద్, నారాయణపేట, మెదక్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 160 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,73,140 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,65,432 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,737 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,971కి పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 37,540 కరోనా పరీక్షలు నిర్వహించగా, 286 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 53 కొత్త కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 307 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,69,352 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,51,747 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,196 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,409కి పెరిగింది.

Related Articles

Back to top button