National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

భారతదేశంలో గత 24 గంటల్లో 41,195 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 39,069 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 490 మంది కరోనా బాధితులు మృతి చెందారు. కొత్త కేసులతో కలిపి దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,20,77,706 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 3,12,60,050 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,29,669 మంది మృతి చెందారు. దేశంలో 3,87,987 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 97.45 శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

11-08-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం గత 24 గంటల్లో 71,030 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 1,869 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 385 కేసులు నమోదవ్వగా కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 10 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2,316 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 18 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,87,051కి పెరిగింది. 19,55,052 మంది కోలుకున్నారు. మొత్తం 13,582 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,417 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 482 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 82 కేసులు నమోదు కాగా అత్యల్పంగా జోగులాంబ గద్వాల్, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇదే సమయంలో 455 మంది కోలుకోగా ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,50,835కి చేరుకుంది. మొత్తం 6,38,865 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,137 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,833 కరోనా మరణాలు నమోదయ్యాయి. తెలంగాణలో రికవరీ రేటు 98.16 శాతంగా ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

fifteen − 15 =

Back to top button