National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

భారతదేశంలో గత 24 గంటల్లో 37,154 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 24 గంట‌ల్లో 39,649 మంది కోలుకున్నారు. దీంతో భారతదేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,74,376కు చేరింది. గత 24 గంటల్లో 724 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,08,764కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,00,14,713 మంది కోలుకున్నారు. 4,50,899 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్పటి వరకు 37,73,52,501 వ్యాక్సిన్ డోసులు వేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 91,677 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,665 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 529 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 33 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. అదే సమయంలో 3,231 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,22,843 పాజిటివ్ కేసులు నమోదు కాగా 18,81,161 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 28,680 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 13,002కి పెరిగింది.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 65,607 కరోనా పరీక్షలు నిర్వహించగా, 465 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 70 కేసులు నమోదు కాగా.. నారాయణపేట, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 869 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,31,683 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,17,638 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,316 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,729కి పెరిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

nineteen − 13 =

Back to top button