More

    మరింత తగ్గుతున్న మహమ్మారి ఉధృతి.. దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో గత 24 గంటల్లో 84,332 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 1,21,311 మంది కోలుకున్నారు. భారతదేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,59,155కు చేరింది. మరో 4,002 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,67,081కు పెరిగింది. కరోనా నుంచి ఇప్పటివరకు 2,79,11,384 మంది కోలుకున్నారు. 10,80,690 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 24,96,00,304 మందికి వ్యాక్సిన్లు వేశారు.

    11-06-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గడచిన 24 గంటల్లో 1,01,863 కరోనా పరీక్షలు నిర్వహించగా 8,239 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,396 కొత్త కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 1,271 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 201 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 11,135 మంది కరోనా నుంచి కోలుకోగా, 61 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 11,824 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 17,96,122 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 16,88,198 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 96,100 మంది చికిత్స పొందుతున్నారు.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,24,066 కరోనా పరీక్షలు నిర్వహించగా1,707 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 158 కొత్త కేసులు నమోదు అయ్యాయి. నల్గొండ జిల్లాలో 147, ఖమ్మం జిల్లాలో 124 కేసులు గుర్తించారు. అత్యల్పంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 5 కేసుల చొప్పున వెల్లడయ్యాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 2,493 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మంది మృతి చెందారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 6,00,318 నమోదైంది. ఇప్పటి దాకా రాష్ట్రంలో 5,74,103 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. 22,759 మందికి చికిత్స జరుగుతోంది.

    Trending Stories

    Related Stories