More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారతదేశంలో గత 24 గంటల్లో 4.71 లక్షల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా.. 2,827 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 3,230 మంది కరోనా నుంచి కోలుకోగా 24 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 19,067 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,13,413కు చేరుకుంది. ఇప్పటి వరకు 4,25,70,165 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,24,181కి చేరుకుంది.

    టెస్ట్ చేయించుకుంటేనే తెలిసింది కరోనా వచ్చిందని:

    సినీ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన గత వారం తాను కరోనా బారిన పడ్డానని తెలిపారు. వైద్యుల సూచనతో వారం రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నానని.. కోలుకున్నానని అన్నారు. చెన్నైలో ఉన్న తాతయ్య, అమ్మమ్మల వద్దకు వెళ్లేందుకు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని… ఈ పరీక్షలో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని చెప్పారు. ముందే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు కనిపించాయని అన్నారు. కేవలం పారాసెటమాల్, విటమిన్ ట్యాబ్లెట్లను మాత్రం వేసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారని చెప్పారు. కరోనా పరీక్షలు చేయించుకోకపోతే… తనకు కరోనా సోకిందనే విషయం కూడా తెలిసేది కాదని అన్నారు.

    Trending Stories

    Related Stories