More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    దేశ వ్యాప్తంగా క‌రోనా ఉధృతి త‌గ్గుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 796 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 19 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. క‌రోనా నుంచి 946 మంది కోలుకోగా, ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 10,889 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ 0.20 శాతంగా ఉంది. ప్ర‌స్తుతం రిక‌వ‌రీ రేటు 98.76 శాతంగా ఉంది.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 15,561 కరోనా పరీక్షలు నిర్వహించగా, 24 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 9 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 6, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 3, వరంగల్ రూరల్ జిల్లాలో 1, హనుమకొండ జిల్లాలో 1, నాగర్ కర్నూలు జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 1, ఖమ్మం జిల్లాలో 1, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1 కేసు వెల్లడయ్యాయి. అదే సమయంలో 25 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,91,522 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,87,198 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 213 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మరణించారు.

    ఏపీలో గడచిన 24 గంటల్లో 1,988 కరోనా పరీక్షలు నిర్వహించగా, 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో 16 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,614 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 23,04,841 మంది ఆరోగ్యవంతులయ్యారు. కేవలం 43 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 14,730 మంది కరోనాతో మరణించారు.

    Trending Stories

    Related Stories