భారతదేశంలో గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,614 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 89 మంది కరోనా కారణంగా మృతి చెందారు. గత 24 గంటల్లో 5,185 మంది కోలుకున్నారు. భారత్ లో 4.29 కోట్ల మందికి కరోనా సోకగా… వారిలో 4.24 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మొత్తం 5,15,803 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 40,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,658 కరోనా పరీక్షలు నిర్వహించగా, 90 కొత్త కేసులు నమోదయ్యాయి. హైదరాబాదు పరిధిలో అత్యధికంగా 35 కొత్త కేసులు నమోదు కాగా… 13 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 172 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,90,224 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,84,972 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,141 మంది చికిత్స పొందుతున్నారు. 4,111 మంది కరోనాతో మరణించారు.
ఏపీలో గడచిన 24 గంటల్లో 12,092 కరోనా పరీక్షలు నిర్వహించగా, 46 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 134 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత కొన్నిరోజుల మాదిరే కరోనా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,751 మంది కరోనా బారినపడగా, వారిలో 23,03,361 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 661 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 14,729 మంది మరణించారు.