దేశంలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు

0
901

దేశంలో క‌రోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 50,407 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి 1,36,962 మంది కోలుకున్నారని పేర్కొంది. క‌రోనా కారణంగా గత 24 గంటల్లో 804 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 6,10,443 మంది చికిత్స తీసుకుంటున్నారు. క‌రోనా మృతుల సంఖ్య‌ 5,07,981కి చేరింది.

ఏపీలో గడచిన 24 గంటల్లో 25,495 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,166 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 256 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 9,632 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,11,133 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా… 22,64,032 మంది కోలుకున్నారు. ఇంకా 32,413 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,688కి పెరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 56,487 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 733 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 185 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2,850 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,82,336 మంది కరోనా బారినపడగా, వారిలో 7,62,594 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,636 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,106కి పెరిగింది.