భారతదేశంలో గత 24 గంటల్లో 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో దేశంలో కరోనా నుంచి 60,405 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాతో కొత్తగా 442 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 9,55,319 మందికి చికిత్స జరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,60,70,510కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 4,84,655గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కు పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 36,452 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,831 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 467 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 40 కేసులను గుర్తించారు. అదే సమయంలో 242 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,84,674 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,62,974 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 7,195 మందికి చికిత్స జరుగుతోంది. ఇప్పటివరకు 14,505 మంది కరోనాతో మరణించారు.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,920 కేసులు వెలుగు చూశాయి. పాజిటివిటీ రేటు 2.30 శాతానికి పెరిగింది. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,97,775కు చేరుకుంది. కరోనా బారినపడి ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,045కు పెరిగింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 417 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 97.05 శాతంగా రికార్డైంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,015 కేసులు బయటపడ్డాయి. అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో మూడేసి చొప్పున కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి.