దేశంలో కరోనా కేసుల అప్డేట్స్.. ఇంకా కలవరపెడుతూ ఉన్న కేరళ

0
793

భారతదేశంలో కొత్త‌గా 13,091 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. క‌రోనా కారణంగా గత 24 గంటల్లో 340 మంది ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపింది. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,62,189కు చేరింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,38,556 మంది చికిత్స తీసుకుంటున్నారు. క‌రోనా నుంచి గత 24 గంటల్లో 13,878 మంది కోలుకున్నారు. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,38,00,925 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం వినియోగించిన డోసుల సంఖ్య 1,10,23,34,225కు చేరింది. నిన్న‌ 11,89,470 కరోనా ప‌రీక్ష‌లు చేశారు.

కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా కలవరపెడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్త‌గా 7,540 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. అదే సమయంలో 7,841 మంది క‌రోనా మ‌హ‌మ్మారి బారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. ఇక స‌వ‌రించిన కేంద్ర ప్ర‌భుత్వ గైడ్‌లైన్స్ ప్ర‌కారం ఇవాళ కొత్త‌గా 211 క‌రోనా మ‌ర‌ణాలు (గ‌డిచిన 24 గంట‌ల్లో మాత్రం 48 మంది మ‌ర‌ణించారు) చోటుచేసుకున్నాయి. దాంతో కేర‌ళ‌లో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 34,621కి పెరిగింది. ప్ర‌స్తుతం అక్క‌డ 70,459 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 164 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 55 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 171 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. కరోనా వల్ల ఒక వ్యక్తి మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,72,987కి చేరుకుంది. మొత్తం 6,65,272 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3,969 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,746 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 41,244 మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా 348 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 69 కేసులు నమోదు కాగా… కర్నూలు, విజయనగరం జిల్లాల్లో అత్యల్పంగా 2 కేసుల చొప్పున నమోదయ్యాయి. ఇదే సమయంలో 358 మంది కరోనా నుంచి కోలుకోగా ముగ్గురు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,69,066కి పెరిగింది. మొత్తం 20,51,440 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 14,406కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,220 యాక్టివ్ కేసులు ఉన్నాయి.