More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారతదేశంలో కొత్త‌గా 18,132 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. అదే సమయంలో 21,563 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. భారతదేశంలో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,32,93,478కి చేరింది. గత 24 గంటల్లో 193 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,50,782కి చేరింది. ప్ర‌స్తుతం 2,27,347 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స పొందుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 95,19,84,373 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. కేర‌ళ‌లో నిన్న ఒక్క‌రోజులో 10,691 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 85 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

    ఏపీలో గడచిన 24 గంటల్లో 38,312 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 624 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 151 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 8 కేసులు గుర్తించారు. అదే సమయంలో 810 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,57,252 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,35,054 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 7,944 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,254కి పెరిగింది.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 33,506 కరోనా పరీక్షలు నిర్వహించగా, 162 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 55 కొత్త కేసులు నమోదు కాగా, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 214 మంది ఆరోగ్యవంతులు కాగా, ఒకరు మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,67,887 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,59,722 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,235 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,930కి పెరిగింది.

    Trending Stories

    Related Stories