National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భారతదేశంలో గత 24గంటల్లో కొత్తగా 33,376 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,32,08,330కు చేరింది. ఇందులో 3,91,516 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,42,317 మంది బాధితులు మరణించారు. గత 24గంటల్లో 32,198 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడ్డారని తెలుస్తోంది. మరో 3,23,74,497 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 308 మంది మరణించారు. ఇక దేశవ్యాప్తంగా 73,05,89,688 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 65,27,175 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని అధికారులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 51,004 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 220 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 71 కొత్త కేసులు నమోదు కాగా.. వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 338 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,61,006 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,51,763 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,351 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,892కి పెరిగింది.

ఏపీలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో 67,911 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,608 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 281 మందికి కరోనా నిర్ధారణ కాగా.. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 1,107 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,27,650 పాజిటివ్ కేసులు నమోదు కాగా 19,98,561 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,119 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,970కి పెరిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

16 + sixteen =

Back to top button