National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భార‌తదేశంలో గత 24 గంటల్లో 38,353 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,20,36,571కు చేరింది. గత 24 గంటల్లో 497 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,29,179కు చేరుకుంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,12,20,981 మంది కోలుకున్నారు. 3,86,351 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 51,90,80,524 వ్యాక్సిన్ డోసులు వేసినట్టు అధికారులు తెలిపారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 89,037 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 494 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 80 కేసులు వెలుగు చూశాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 621 మంది కరోనా నుంచి కోలుకోగా ముగ్గురు మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,50,353 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,38,410 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,112 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,831కి చేరింది.

10-08-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,461 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 235 కేసులు నమోదు కాగా కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 12 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2,113 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకు 13,564 మంది మృతి చెందారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,85,182కి చేరుకోగా… 19,52,736 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,882 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × five =

Back to top button