Uncategorized

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

భారతదేశంలో గత 24 గంటల్లో 16,678 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 14,629 మంది కోలుకోగా… 26 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,30,713కి పెరిగింది. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,36,39,329కి పెరిగాయి. వీరిలో 4,29,83,162 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,25,454 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 5.99 శాతంగా, రికవరీ రేటు 98.50 శాతంగా, క్రియాశీల రేటు 0.30 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,98,88,77,537 డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,193 కరోనా పరీక్షలు నిర్వహించగా, 459 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 323 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 40, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 29 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 468 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,06,124 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,96,833 మంది కోలుకున్నారు. ఇంకా 5,180 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మృతి చెందారు. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రిలో చేరడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎవ్వరికీ ఆక్సిజన్ సపోర్ట్ అవసరం పడటం లేదని వైద్యులు అంటున్నారు.

Related Articles

Back to top button