More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారతదేశంలో మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వెళుతోంది. జూన్ నెల ఆరంభం నుంచి కరోనా కేసుల్లో క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. జులై నెలాఖరుకు కరోనా నాలుగో వేవ్ రావొచ్చంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3.44 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. 8,329 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 2.41 శాతంగా ఉంది. అదే సమయంలో కరోనా నుంచి 4,216 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 10 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు దేశవ్యాప్తంగా 40,370గా ఉన్నాయి. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 3,081 మంది కరోనా బారిన పడితే, ముంబైలో 1,956 కేసులు వచ్చాయి. కేరళలో 2,415 కేసులు, ఢిల్లీలో 655 కేసులు నమోదయ్యాయి.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 16,319 కరోనా పరీక్షలు నిర్వహించగా, 155 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో అత్యధికంగా 81 కొత్త కేసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 42, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11, సంగారెడ్డి జిల్లాలో 8 కేసులు గుర్తించారు. అదే సమయంలో 59 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,94,184 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,89,166 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

    Trending Stories

    Related Stories