More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారతదేశంలో కొత్త‌గా 4,194 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి గత 24 గంటల్లో 6,208 మంది కోలుకున్నార‌ని అధికారులు తెలిపారు. క‌రోనాతో బాధ‌ప‌డుతూ గత 24 గంటల్లో 255 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలిపింది. క‌రోనా నుంచి గత 24 గంటల్లో 6,208 మంది కోలుకున్న‌ట్లు తెలిపింది. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,24,26,328గా ఉంది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 42,219 మంది చికిత్స తీస‌కుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 179.72 కోట్ల క‌రోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించారు.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 24,444 కరోనా పరీక్షలు నిర్వహించగా, 91 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదు పరిధిలో 33 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 184 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాతో మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,134 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,84,800 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,223 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

    ఏపీలో గడచిన 24 గంటల్లో 12,208 కరోనా పరీక్షలు నిర్వహించగా, 88 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో 97 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాతో ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,705 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 23,03,227 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 749 మంది చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 14,729 మంది చనిపోయారు.

    Trending Stories

    Related Stories