More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారతదేశంలో గత 24 గంటల్లో కొత్త‌గా 11,466 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 460 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,39,683 మంది చికిత్స తీసుకుంటున్నారు. క‌రోనా నుంచి గత 24 గంటల్లో 11,961 మంది కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 3,37,87,047 మంది కోలుకున్నారు. క‌రోనా వ‌ల్ల దేశంలో మొత్తం 4,61,849 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 109,63,59,205 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. కేర‌ళ‌లో గత 24గంటల్లో 6,409 మందికి క‌రోనా నిర్ధార‌ణ అయింది. 47 మంది ప్రాణాలు కోల్పోయారు.

    ఏపీలో గడచిన 24 గంటల్లో 31,054 కరోనా పరీక్షలు నిర్వహించగా 231 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 37 కేసులు నమోదవ్వగా.. కర్నూలు జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 362 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,68,718 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,51,082 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,233 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,403కి పెరిగింది.

    Trending Stories

    Related Stories