More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో కొత్తగా 34,973 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,31,74,954కి చేరింది. అదే సమయంలో 37,681 మంది కోలుకున్నార‌ని తెలిపింది. దేశంలో క‌రోనాతో మ‌రో 260 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,42,009కి పెరిగింది. ఒక్క‌ కేర‌ళ‌లోనే 26,200 కొత్త కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో నిన్న 114 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,23,42,299 మంది కోలుకున్నారు. 3,90,646 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 72,37,84,586 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

    ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 62,856 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 1,439 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 261 కేసులు.. కర్నూలు, విజయనగం జిల్లాలలో అత్యల్పంగా 8 కేసుల చొప్పున నమోదయ్యాయి. ఇదే సమయంలో 14 మంది కరోనా కారణంగా మృతి చెందారు. 1,311 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,26,042కి చేరుకుంది. ఇప్పటి వరకు 19,97,454 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ 13,964 మంది కరోనా కారణంగా ప్రాణాలను కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,624 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 75,199 కరోనా పరీక్షలు చేయగా, 315 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 83 కొత్త కేసులు నమోదు కాగా, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 340 మంది కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,60,786 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,51,425 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,470 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,891కి పెరిగింది.

    Related Stories