National

భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు.. దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భార‌త్‌లో కొత్త‌ క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. భార‌త్‌లో గత 24 గంటల్లో 28,204 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. 147 రోజులలో తక్కువ స్థాయిలో కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,19,98,158కు చేరింది. అదే సమయంలో 373 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,28,682కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,11,80,968 మంది కోలుకున్నారు. 3,88,508 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 51,45,00,268 వ్యాక్సిన్ డోసులు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 80,658 కరోనా పరీక్షలు నిర్వహించగా, 453 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 68 కేసులు వెల్లడి కాగా.. వికారాబాద్, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 614 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,49,859 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,37,789 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,242 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,828కి చేరింది.

09-08-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 54,455 నమూనాలు పరీక్షించగా 1,413 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 458 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 9 పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో 1,795 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13,549కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,83,721 పాజిటివ్ కేసులు నమోదు కాగా 19,50,623 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,549 మందికి చికిత్స కొనసాగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty + seventeen =

Back to top button