More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 18,257 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 1,28, 690 యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.22 శాతంగా నమోదైంది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 43, 622, 651కి చేరుకుంది. తాజాగా 42 మంది మృతి చెందారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,25,428కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 544 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు చనిపోయారు. ఢిల్లీలో పాజిటివిటి రేటు 3.37 శాతంగా ఉంది. మహారాష్ట్రలో 2,760 కొత్త కేసులు రాగా, ఐదుగురు మృతి చెందారు.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 24,968 శాంపిల్స్ పరీక్షించగా.. 528 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదు జిల్లాలో అత్యధికంగా 327 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 52, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 39 కేసులను గుర్తించారు. అదే సమయంలో 485 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,05,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,96,365 మంది కోలుకున్నారు. ఇంకా 5,189 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

    spot_img

    Trending Stories

    Related Stories