National

భారతదేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భారతదేశంలో గత 24 గంటల్లో 42,766 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 45,254 మంది కోలుకున్నారు. భారతదేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,95,716కు చేరింది. గత 24 గంటల్లో 1,206 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,07,145కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,99,33,538 మంది కోలుకున్నారు. 4,55,033 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,06,045 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 729 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ, ఖమ్మం జిల్లాలోనూ 72 కొత్త కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 987 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,720కి చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు 6,30,514 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,15,852 మంది కొవిడ్ నుంచి విముక్తులయ్యారు. ఇంకా 10,942 మంది చికిత్స పొందుతున్నారు.

09-07-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో ఏపీలో 3,040 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 659 కేసులు నమోదు కాగా అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 45 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,576 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,17,253కి చేరుకోగా మొత్తం 18,73,993 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 12,960 మంది మృతి చెందారు. ప్రస్తుతం 30,300 మంది చికిత్స పొందుతూ ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

3 + nineteen =

Back to top button