దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

0
1019

దేశంలో క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్త‌గా 1,79,723 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో క‌రోనా కారణంగా 146 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 7,23,619 మంది చికిత్స తీసుకుంటున్నారు. భారతదేశంలో డైలీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి చేరుకుంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కు చేరుకుంది. మొత్తం కేసుల సంఖ్య‌ 3,57,07,727కు చేరింది. కోలుకున్న వారి సంఖ్య 3,45,00172కు పెరిగింది. మృతుల సంఖ్య మొత్తం 4,83,936గా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 69,15,75,352 క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. మొత్తం 151,94,05,951 వ్యాక్సిన్ డోసులు వేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38,479 కరోనా శాంపిల్స్ పరీక్షించగా… 1,257 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 254 కేసులు గుర్తించారు. అదే సమయంలో 140 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,81,859 పాజిటివ్ కేసులు నమోదవగా, 20,62,580 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,774 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,505కి పెరిగింది.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 48,583 కరోనా శాంపిల్స్ పరీక్షించగా 1,673 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,165 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమమంలో 330 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,94,030 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,76,466 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 13,522 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,042కి పెరిగింది.