More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో కొత్త‌గా 9,419 కరోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 8,251 మంది కరోనా నుంచి కోలుకున్నారు. క‌రోనాతో గత 24 గంటల్లో 159 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 94,742 మంది క‌రోనా కారణంగా హోం క్వారంటైన్, ఆసుప‌త్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి మొత్తం 3,40,97,388 మంది కోలుకున్నారు. మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 4,74,111కు చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 130.39 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

    ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 31,957 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 181 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 176 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,011 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,74,217కి పెరిగింది. ఇప్పటి వరకు 20,57,749 మంది కోలుకున్నారు. 14,457 మంది మృతి చెందారు.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 38,085 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. 205 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 79 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 185 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,77,546 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,69,673 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,871 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించినవారి సంఖ్య 4,002కి పెరిగింది.

    Trending Stories

    Related Stories