దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
862

భారతదేశంలో కొత్త‌గా 10,126 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 332 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, క్వారంటైన్ల‌లో 1,40,638 మందికి క‌రోనాకు చికిత్స అందుతోంది. కరోనా నుంచి అదే సమయంలో 11,982 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,37,75,086కు చేరుకుంది. క‌రోనాతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 4,61,389 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 59,08,440 డోసుల వ్యాక్సిన్ వేశారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 109,08,16,356 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 37,844 కరోనా పరీక్షలు నిర్వహించగా, 161 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 50 కొత్త కేసులు నమోదు కాగా, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 174 మంది ఆరోగ్యవంతులు కాగా.. ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,72,650 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,64,933 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,750 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,967కి పెరిగింది.

08-11-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 28,855 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 246 మంది పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 80 కొత్త కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 334 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,401కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,68,487 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,50,720 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 3,366 మంది చికిత్స పొందుతున్నారు.