More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో కొత్తగా 43,263 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,31,39,981కి చేరింది. అదే సమయంలో 40,567 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 338 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,41,749కి పెరిగింది. ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,23,04,618 మంది కోలుకున్నారు. 3,93,614 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 71,65,97,428 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. ఒక్క‌ కేర‌ళ‌లోనే 30,196 కొత్త కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో నిన్న 181 మంది ప్రాణాలు కోల్పోయారు.

    తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 78,421 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 329 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక కరోనా మరణం సంభవించింది. అదే సమయంలో 307 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఈ గణాంకాలతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,60,471కి చేరుకుంది. ఇదే సమయంలో 6,51,085 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3,889 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,497 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    08-09-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 61,363 మంది శాంపిల్స్ పరీక్షించగా 1,361 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 282 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,288 మంది కరోనా నుంచి కోలుకోగా 15 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 20,24,603కి పెరిగాయి. మొత్తం 19,96,143 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 13,950 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,510 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    Trending Stories

    Related Stories