More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భార‌తదేశంలో గత 24 గంటల్లో 35,499 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,19,69,954కు చేరింది. అదే సమయంలో 447 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,28,309కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,11,39,457 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,02,188 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 50,86,64,759 వ్యాక్సిన్ డోసులు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.

    తెలంగాణలో గత 24 గంటల్లో 79,231 కరోనా పరీక్షలు నిర్వహించగా 449 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73 కొత్త కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 623 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,49,406 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,37,175 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 8,406 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,825కి చేరింది.

    08-08-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 85,283 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,050 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 375 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 23 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2,458 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 13,531 మంది కరోనాతో కన్నుమూశారు. ఏపీలో ఇప్పటిదాకా 19,82,308 పాజిటివ్ కేసులు నమోదు కాగా 19,48,828 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,949 మంది చికిత్స పొందుతున్నారు.

    Trending Stories

    Related Stories