More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 18,840 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. ఇప్పటిదాకా కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,36,04,394కి చేరుకుంది. గడచిన 24 గంటల్లో కరోనా వల్ల 43 మంది మృతి చెందారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,25,386కి చేరింది. ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. కేరళలో ఒక్కరోజే 3310 కొత్త కేసులు నమోదవగా, పశ్చిమ బెంగాల్లో 2950, మహారాష్ట్రలో 2944, తమిళనాడులో 2722, కర్ణాటకలో 1037 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనే 68.81 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 16,104 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటిదాకా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,29,53,980కి చేరుకుంది. రికవరీ రేటు 98.51గా నమోదైంది.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 28,055 శాంపిల్స్ పరీక్షించగా.. 608 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 329 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 67, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 54, సంగారెడ్డి జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 459 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 8,05,137 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,95,880 మంది కోలుకున్నారు. ఇంకా 5,146 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

    spot_img

    Trending Stories

    Related Stories